తెలుగు రాష్ట్రాల్లో ఎండ దెబ్బ.. బయటకి అంటేనే భయం భయం
మొన్నటి వరకి అకాల వర్షాల కారణంగా వేడి నుండి కొంత ఉపశమనం పొందినప్పటికీ.. వారం నుండి ఎండల కారణంగా చాలా మంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
మొన్నటి వరకు ఎండల నుండి కాస్త ఉపశమనం కలిగించేలా వర్షాలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత మరియు ఎండ వేడి నుండి ప్రజలు వర్షాల కారణంగా తప్పించుకున్నారు. కానీ గత వారం రోజులుగా ఎండ వేడికి జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రోడ్లపై జనాలు కనిపించడం లేదు.
కర్ఫ్యూ వాతావరణం నగరాలు.. పట్టణాలు మరియు పల్లెల్లో కనిపిస్తుంది. ఈ స్థాయి ఎండలు ఊహించలేదని.. రికార్డు స్థాయి ఎండలు మండి పోతున్న ఈ సమయంలో ముందు ముందు మరింత దారుణంగా పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. బయటకు వెళ్లాలి అంటూ తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎండ దెబ్బ కొట్టడం ఖాయం అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎండ వేడికి కనీసం అయిదు నుండి పది నిమిషాలు కూడా బయట ఉండలేని పరిస్థితి. ఏపీలో ఇప్పటి వరకు ఎండ దెబ్బకు ఏకంగా 13 మంది మృతి చెందగా తెలంగాణ లో వడ దెబ్బ తో ముగ్గురు చనిపోయారు. ఎండ కారణంగా రోజు వారి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎండ కారణంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అసౌకర్యంకు గురి అవుతున్నారు.
వడ దెబ్బ తో ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎండ తీవ్రంగా ఉండటంతో పాటు వేడి గాలుల వల్ల కూలీలు రోజు వారి పని చేసుకునే పరిస్థితి లేదు.
Also Read: Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?
రోజు వారి కూలీ పనికి వెళ్లడం కాదు.. కనీసం బయటకు వెళ్లాలి అన్నా కూడా భయం భయంగా ఉందంటూ జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ మొదటి వారం పూర్తి అయ్యే వరకు ఈ ఎండలు తప్పవు అంటూ వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన నేపథ్యంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిందే అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రోణిహి కార్తె మరి కొన్ని రోజుల్లో రాబోతున్న విషయం తెల్సిందే. రోహిణి కార్తె లో మరింతగా ఎండలు కొట్టే ప్రమాదం ఉంది. కనుక మరింత జాగ్రత్తలు అవసరం అంటూ వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ వేసవి కాలంలో మసాలా ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సాధ్యం అయినంత ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అంతే కాకుండా చల్లదనాన్ని ఇచ్చే పుచ్చకాయ.. కీరా వంటి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఎంద దెబ్బ కొడితే ఎక్కువగా మజ్జిక తాగడంతో పాటు సాధ్యం అయినంత వరకు లైట్ ఫుడ్ ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: Rohini Leg Surgery : రోహిణికి సర్జరీ.. అసలేం జరిగిందంటే?.. ఇప్పుడు ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి